యాదాద్రిలో సరికొత్త బస్‌స్టేషన్‌ ప్రారంభానికి సిద్ధం

యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిర్మించిన సరికొత్త ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం వారం రోజుల్లోగా ప్రారంభం కానుంది. తుది దశలో రంగులతో హంగులు దిద్దుకుంటోంది.

Published : 28 Jan 2023 05:05 IST

యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిర్మించిన సరికొత్త ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం వారం రోజుల్లోగా ప్రారంభం కానుంది. తుది దశలో రంగులతో హంగులు దిద్దుకుంటోంది. సీఎం కేసీఆర్‌ దృఢ సంకల్పం మేరకు ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపొందించే లక్ష్యంతో వైటీడీఏ భూసేకరణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఇక్కడ పటిష్ఠమైన రవాణా వ్యవస్థ ఏర్పాటుకు కొండ కింద అయిదెకరాలతో పాటు రూ.6 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం రెండున్నర ఎకరాల్లో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో 8,600 చ.అ విస్తీర్ణంలో బస్‌స్టేషన్‌ నిర్మాణమైంది. ప్రహరీ, ఇతర అవసరాలకు రూ.కోటి వెచ్చించనున్నారు. ఆర్టీసీకి చెందిన డీఈ విష్ణు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. యాత్రికుల రవాణా సౌలభ్యం కోసం నిర్మితమైన ఈ బస్‌స్టేషన్‌ను వచ్చే నెల 1న ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని