భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా కవిత

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, నేషనల్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు.

Published : 28 Jan 2023 05:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, నేషనల్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఏడాదిపాటు ఆమె సేవలు అందించనున్నారు. ఈ మేరకు భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ కౌషిక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015 నుంచి స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌గా సేవలు అందిస్తున్నారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెరిగేలా కృషిచేస్తానని కవిత పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని