పోలీసులకు కొట్టే హక్కు ఎక్కడిది..?

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం స్థానిక ఎస్సైపై ఆయన పనిచేసే పోలీస్‌స్టేషన్‌లోనే ఫిర్యాదు నమోదైంది. భూపాలపల్లి జిల్లా మాజీ కలెక్టర్‌ ఆకునూరి మురళీ దగ్గరుండి మరీ ఫిర్యాదు చేయించారు.

Updated : 28 Jan 2023 05:24 IST

ప్రశ్నించిన మాజీ కలెక్టర్‌.. ఎస్సైపై ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం స్థానిక ఎస్సైపై ఆయన పనిచేసే పోలీస్‌స్టేషన్‌లోనే ఫిర్యాదు నమోదైంది. భూపాలపల్లి జిల్లా మాజీ కలెక్టర్‌ ఆకునూరి మురళీ దగ్గరుండి మరీ ఫిర్యాదు చేయించారు. ఫిర్యాదులో వివరాల ప్రకారం..  జిల్లా కేంద్రంలో కూనారపు భిక్షపతి అనే యువకుడు రాంగ్‌రూట్లో ద్విచక్రవాహనాన్ని నడుపుతుండగా.. స్థానిక ఎస్సై రామకృష్ణ అతన్ని ఆపి లాఠీతో కొట్టారు. అటుగా వెళ్తున్న మాజీ కలెక్టర్‌ ఆకునూరి మురళీ తన వాహనాన్ని ఆపి.. మీకు కొట్టే హక్కు ఎక్కడిదని ఎస్సైను ప్రశ్నించారు. ఆ యువకుడికి సారీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. యువకుడికి సారీ చెప్పి ఎస్సై వెళ్లిపోయారు. అనంతరం అక్కడి నుంచి యువకుడితో నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సైపై ఆకునూరి మురళీ ఫిర్యాదు చేయించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు