మూడేళ్ల తర్వాత తొలిసారిగా సున్నా కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మూడేళ్ల కిందట తొలిసారిగా నమోదు కాగా.. అప్పటినుంచి ఇప్పటివరకూ స్వల్ప సంఖ్యలోనైనా నమోదవుతూనే ఉన్నాయి.

Updated : 28 Jan 2023 05:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మూడేళ్ల కిందట తొలిసారిగా నమోదు కాగా.. అప్పటినుంచి ఇప్పటివరకూ స్వల్ప సంఖ్యలోనైనా నమోదవుతూనే ఉన్నాయి. శుక్రవారం(27న) 3,690 నమూనాలను పరీక్షించగా.. ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో 2020 మార్చి 2న తొలి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. గత మూడేళ్లలో గరిష్ఠంగా ఒక్కరోజులో 10 వేలకు పైగా కేసులు నిర్ధారణ కాగా.. కనిష్ఠంగా 2 కేసులు నమోదయ్యాయి. గత నవంబరులో గరిష్ఠంగా 77.. కనిష్ఠంగా 2, డిసెంబరులో గరిష్ఠం 16.. కనిష్ఠం 5, జనవరిలో గరిష్ఠం 15.. కనిష్ఠంగా శుక్రవారం సున్నా కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు