సంక్షిప్త వార్తలు(2)

సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో శనివారం తెల్లవారుజామున రాష్ట్రంలోనే కనిష్ఠంగా 10.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 10.9, కుమురం భీం జిల్లా సిర్పూర్‌(యు)లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Updated : 30 Jan 2023 05:45 IST

సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత

ఈనాడు, హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో శనివారం తెల్లవారుజామున రాష్ట్రంలోనే కనిష్ఠంగా 10.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 10.9, కుమురం భీం జిల్లా సిర్పూర్‌(యు)లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపే ఉన్నాయి. సోమవారం సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌ జిల్లాల్లో 15 డిగ్రీలలోపు, మిగిలిన జిల్లాల్లో 16 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం గరిష్ఠంగా భద్రాద్రి జిల్లా సత్యానారాయణపురంలో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


నేడు అనాథల అరిగోస దీక్ష: మందకృష్ణ

రాష్ట్రంలోని అనాథలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద సోమవారం ‘అనాథల అరిగోస దీక్ష’ను నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌, అనాథ హక్కుల పోరాట వేదికల వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. రాష్ట్రంలోని అనాథలతో పాటు రాజకీయ, విద్యార్థి, మహిళా, దివ్యాంగ, ప్రజా సంఘాలు పాల్గొంటాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని