ఒక్కరోజులో 58,845 దరఖాస్తులు.. నేటితో ముగియనున్న గ్రూప్‌-4 గడువు

గ్రూప్‌-4 ఉద్యోగాలకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. గడువు ఈనెల 30తో ముగియనున్న నేపథ్యంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 58,845 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు.

Updated : 30 Jan 2023 05:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-4 ఉద్యోగాలకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. గడువు ఈనెల 30తో ముగియనున్న నేపథ్యంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 58,845 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు అందిన మొత్తం దరఖాస్తుల సంఖ్య 8,00,004కి చేరింది. సోమవారం చివరి రోజు కావటంతో ఉద్యోగార్థులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సర్వర్‌పై ఒత్తిడి అనూహ్యంగా పెరిగింది. దరఖాస్తు ఫారం పూర్తిచేశాక ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని