సిద్దిపేటలో రాష్ట్రంలోనే అతిపెద్ద ద్వారపాలక శిల్పం: శివనాగిరెడ్డి

సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల పొలాల్లో రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద ద్వారపాలక శిల్పం ఆలనాపాలనా కరవైందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 30 Jan 2023 04:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల పొలాల్లో రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద ద్వారపాలక శిల్పం ఆలనాపాలనా కరవైందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శిల్పకళ, లక్షణాల్ని బట్టి ఇది కళ్యాణి చాళుక్యుల తొలి కాలమైన క్రీ.శ.10వ శతాబ్దికి చెందిందని ఆయన పేర్కొన్నారు. శ్రీరామోజు హరగోపాల్‌ నేతృత్వంలోని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్‌, మహమ్మద్‌ నసీరుద్దీన్‌లతో కలిసి ఆదివారం ఆయన విగ్రహాన్ని పరిశీలించారు. భూమిపై 6 అడుగులు, లోపల 3 అడుగుల పొడవు, 9 అంగుళాల మందంతో గ్రానైట్‌ రాయితో చెక్కిన ఈ శిల్పం విష్ణు ద్వారపాలకుడైన విజయుడిదని శివనాగిరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ములుగు జిల్లా ఘన్‌పూర్‌లో బయల్పడిన 8 అడుగుల వైష్ణవ ద్వారపాలక శిల్పం కంటే ఇది పెద్దదని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు