మహాత్మా మన్నించు..!

గాంధీ ఆశయాలు, జీవిత చరిత్ర భావితరాలకు చేరాలనే ఉద్దేశంతో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మహత్మాగాంధీ సంచార డిజిటల్‌ మ్యూజియం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరింది.

Updated : 30 Jan 2023 05:37 IST

గాంధీ ఆశయాలు, జీవిత చరిత్ర భావితరాలకు చేరాలనే ఉద్దేశంతో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మహత్మాగాంధీ సంచార డిజిటల్‌ మ్యూజియం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరింది. మ్యూజియం ఉన్న వాహనాన్ని గతంలో హైదరాబాద్‌లో తిప్పుతూ గాంధీ చరిత్రను ప్రదర్శించడంతో పాటు ఆశయాలను ప్రచారం చేసేవారు. ఏడాదిన్నర కిందట బ్రేక్‌ డౌన్‌తో ఆ వాహనం నిలిచిపోయింది. మరమ్మతు చేయకుండా బస్సును లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌ ఆవరణలో వదిలేయడంతో టైర్లు, ఇతర సామగ్రి పూర్తిగా పాడైపోయాయి. దీంతో ఆ బస్సులోని గాంధీ చిత్రాలు, డిజిటల్‌ పరికరాలను బాపూఘాట్‌లోని ఓ గదిలోకి తరలించారు. ఇక్కడ ముఖ్య కార్యక్రమాలు జరిగే సమయంలో పాడైపోయిన ఈ బస్సును నేతలకు కనిపించకుండా పరదాలు చుట్టి ఉంచుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఈ వాహనానికి మరమ్మతులు చేయించి మహాత్మాగాంధీ చరిత్రను భావి తరాలకు తెలియజెప్పాలన్న సదాశయానికి తోడ్పడాలని కోరుతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని