వ్యవసాయ అధికారుల పోస్టులకు ఏప్రిల్‌ 25న పరీక్ష

వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి.. అయిదు ఉద్యోగ ప్రకటనల్లోని పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ.. రాత పరీక్షల (కంప్యూటర్‌ ఆధారిత/ఓఎంఆర్‌) షెడ్యూలు ప్రకటించింది.

Published : 31 Jan 2023 04:31 IST

 మొత్తం 5 ప్రకటనల పోస్టులకు రాత పరీక్షల షెడ్యూలు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి.. అయిదు ఉద్యోగ ప్రకటనల్లోని పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ.. రాత పరీక్షల (కంప్యూటర్‌ ఆధారిత/ఓఎంఆర్‌) షెడ్యూలు ప్రకటించింది. కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ సోమవారం ఈ వివరాలతో ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం పేపర్‌-1, మధ్యాహ్నం పేపర్‌-2 పరీక్షలు ఉంటాయి.

ఇదీ షెడ్యూలు...

* 148 వ్యవసాయ అధికారుల పోస్టులకు (ఉద్యోగ ప్రకటన: 27/2022) ఏప్రిల్‌ 25న పరీక్ష నిర్వహిస్తారు.

* 18 డ్రగ్‌ ఇన్‌స్పెక్టరు పోస్టులకు (ప్రకటన: 21/2022) మే 7న

* 247 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు (ప్రకటన: 20/2022) మే 13న

* 128 సాంకేతిక, ఇంటర్‌ విద్యలో ఫిజికల్‌ డైరెక్టర్ల పోస్టులకు (ప్రకటన: 26/2022) మే 17న

* 71 సాంకేతిక, ఇంటర్మీడియట్‌ విద్యలో లైబ్రేరియన్‌ పోస్టులకు (ప్రకటన: 30/2022) మే 17న పరీక్ష నిర్వహిస్తారు.

వ్యవసాయ అధికారుల పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు..

వ్యవసాయ అధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. పరిపాలన కారణాలతో గడువు పెంచామని, అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ములుగు కళాశాలలో పోస్టుల భర్తీకి 6 నుంచి ఇంటర్వ్యూలు

ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు పేర్కొంది. వివరాల కోసం కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు