సింగరేణిలో 558 ఉద్యోగాలు

సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈమేరకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్‌ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated : 31 Jan 2023 05:38 IST

ఫిబ్రవరి మొదటి వారంలోగా నియామక ప్రకటన

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈమేరకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్‌ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. కొత్తగూడెంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 277 పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో.. మిగిలిన 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తారు.

పోస్టుల వివరాలు..

30 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ 2 గ్రేడ్‌-ఈ అండ్‌ ఎం), 20 జూనియర్‌ ఇంజినీర్‌ (ఈ 1 గ్రేడ్‌-ఈ అండ్‌ ఎం), 4 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ 2 గ్రేడ్‌-సివిల్‌), 4 జూనియర్‌ ఇంజినీర్‌ (ఈ 1 గ్రేడ్‌-సివిల్‌), 11 వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (ఈ 1 గ్రేడ్‌), 4 ప్రోగ్రామర్‌ ట్రైనీ (ఈ 1 గ్రేడ్‌), 20 జూనియర్‌ కెమిస్ట్‌ లేదా జూనియర్‌ టెక్నికల్‌ ఇన్‌స్పెక్టర్‌, 114 ఫిట్టర్‌ ట్రైనీ (కేటగిరీ-1), 22 ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ (కేటగిరీ-1), 43 వెల్డర్‌ ట్రైనీ (కేటగిరీ-1), 5 శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ (కేటగిరీ-డి) పోస్టులకు అంతర్గత నియామకాలు చేపడతారు.

* 30 జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు; మేనేజ్‌మెంట్ ట్రైనీలు.. మైనింగ్‌ (79); ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ (66), సివిల్‌ (18), ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ (10), ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్ (18), ఐటీ (7), హైడ్రోజియాలజిస్ట్‌ (2), పర్సనల్‌ (22)తో పాటు 3 జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌, 10 జూనియర్‌ ఎస్టేట్స్ ఆఫీసర్‌, 16 సబ్‌ ఓవర్‌సీర్‌ ట్రైనీ (సివిల్‌) పోస్టుల భర్తీకి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి రాతపరీక్ష నిర్వహిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని