ఈ వారంలోనే గురుకుల నోటిఫికేషన్లు!

సంక్షేమ గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు కసరత్తు మొదలుపెట్టింది.

Published : 31 Jan 2023 04:31 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంక్షేమ గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు కసరత్తు మొదలుపెట్టింది. ఇటీవల బీసీ గురుకులాల్లోని అదనపు పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య 11,105కి చేరింది. న్యాయ వివాదాల పరిధిలోని పీఈటీ, పీడీ తదితర పోస్టులను మినహాయించి మిగతా పోస్టులకు వీలైనంత త్వరగా ఉద్యోగ ప్రకటనలు వెలువరించాలని బోర్డు నిర్ణయానికి వచ్చింది. ఈ వారంలోనే దాదాపు 6 వేలకు పైగా పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని భావిస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు నెల నుంచి 45 రోజుల వరకు సమయమివ్వాలని, అనంతరం తగిన సమయం ఇచ్చి రాత పరీక్షలు పూర్తిచేయాలని కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 2023-24 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి నియామకాలు పూర్తిచేయాలని సమాలోచనలు చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని