విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో నిర్ణయం
విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు.
సీఎండీ ప్రభాకరరావు
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. ఉద్యోగులు వినియోగదారుల సేవలకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో రాష్ట్ర విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘం డైరీని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని, కరెంట్ లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు ఎక్కడా లేవన్నారు. ‘‘కొవిడ్‌తో రెండేళ్ల పాటు విద్యుత్ సంస్థలకు రూ.1300 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వీటి నష్టాలకు కేంద్రం విధానాలు కూడా ఒక కారణం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రమేష్, నేతలు వినోద్‌కుమార్, విజయ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
-
Ts-top-news News
ఎన్ఐటీ విద్యార్థుల హవా.. ప్రాంగణ నియామకాల్లో 1,326 మంది ఎంపిక
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్
-
Politics News
వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన