కంటి వెలుగుకు విశేష స్పందన: సీఎస్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.

Published : 31 Jan 2023 04:31 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. బీఆర్‌కేభవన్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో సోమవారం దృశ్యమాధ్యమ(వీసీ) సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల ఆమె కలెక్టర్లను అభినందించారు. శిబిరాల్లో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో జిల్లాస్థాయిలో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీ చేయించాలని సూచించారు.

14.92 లక్షల మందికి పరీక్షలు

రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 14.92 లక్షల మందికి కంటి పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. పరీక్షించిన వారిలో 2.34 లక్షల మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించగా మరో 3.38 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసెస్‌ పంపిణీ అందజేసినట్లు వివరించింది. ఇప్పటివరకు 507 పంచాయతీలు, 205 వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తికాగా మరో 979 పంచాయతీలు, 525 వార్డుల్లో కొనసాగుతున్నాయంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని