సింగరేణి డైరెక్టర్లుగా శ్రీనివాస్‌, వెంకటేశ్వర్‌రెడ్డి

సింగరేణి ఆపరేషన్స్‌ విభాగానికి ఎన్‌వీకే శ్రీనివాస్‌ (అడ్రియాల జీఎం, పెద్దపల్లి జిల్లా), ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌(పీపీ)కు జి.వెంకటేశ్వర్‌రెడ్డి (మణుగూరు జీఎం) డైరెక్టర్లుగా నియమితులయ్యారు.

Published : 31 Jan 2023 04:31 IST

కొత్తగూడెం సింగరేణి, గోదావరిఖని, న్యూస్‌టుడే: సింగరేణి ఆపరేషన్స్‌ విభాగానికి ఎన్‌వీకే శ్రీనివాస్‌ (అడ్రియాల జీఎం, పెద్దపల్లి జిల్లా), ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌(పీపీ)కు జి.వెంకటేశ్వర్‌రెడ్డి (మణుగూరు జీఎం) డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ మంగళవారం ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ప్లానింగ్‌, ప్రాజెక్ట్స్‌ సంచాలకుడి స్థానం అయిదేళ్లుగా ఖాళీగా ఉంది. వీటి భర్తీకి సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీటికి సీనియారిటీ ప్రకారం పది మంది అధికారులను ఆహ్వానించారు. కొత్తగా ఎంపికైన వారు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రెండేళ్ల పాటు ఆయా పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో వైపు సింగరేణి ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరాంకు పర్సనల్‌, అడ్మినిస్ట్రేషన్‌ వెల్ఫేర్‌ (పా) విభాగం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని