జూన్‌ 5 నుంచి గ్రూపు-1 పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్‌సీ) గ్రూప్‌ ప్రధాన (మెయిన్స్‌) పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది.

Published : 01 Feb 2023 05:09 IST

12 వరకు నిర్వహణ
షెడ్యూలు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్‌సీ) గ్రూప్‌ ప్రధాన (మెయిన్స్‌) పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. వచ్చే జూన్‌ 5 నుంచి 12 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అందులో 11వ తేదీ ఆదివారమైనందున ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. ఈ పరీక్షలు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో జరుగుతాయంది. జనరల్‌ ఇంగ్లిష్‌ మినహా మిగతా అన్ని పేపర్లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని వెల్లడించింది. మొత్తం పరీక్షల్లో ఒక్కదానికి గైర్హాజరయినా వారిని అనర్హులుగా ప్రకటిస్తామంది. తెలంగాణలో తొలిసారిగా నిర్వహించే గ్రూప్‌-1లో 503 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 16న గ్రూప్‌ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో బహుళజోన్‌ రిజర్వేషన్ల వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేసింది. జనవరి 14న ప్రిలిమ్స్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ తాజాగా మెయిన్స్‌ పరీక్షల తేదీలను ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని