17 మంది ఐఏఎస్‌ల బదిలీలు

రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్లు సహా 17 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 01 Feb 2023 05:19 IST

ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖకు
12 జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్లు సహా 17 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల విద్య, సాంకేతిక విద్య కమిషనర్‌, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ రాష్ట్ర భూరెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆయనకు ప్రభుత్వం భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ను మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్‌గా బదిలీ చేసింది. హైదరాబాద్‌ కలెక్టర్‌గానూ ఆయనకు పూర్తి అదనపు బాధ్యత (ఫుల్‌ అడిషనల్‌ ఛార్జి) అప్పగించింది. కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌కు జగిత్యాల కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు  అప్పగించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని