రెవెన్యూకు ప్రత్యేక నిధులు కేటాయించండి

అద్దె, శిథిల భవనాల్లో కొనసాగుతున్న రెవెన్యూ కార్యాలయాలకు పూర్తిస్థాయి నిర్మాణాల కోసం 2023-24 బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) కోరింది.  

Updated : 01 Feb 2023 05:24 IST

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును కోరిన ట్రెసా  

ఈనాడు, హైదరాబాద్‌: అద్దె, శిథిల భవనాల్లో కొనసాగుతున్న రెవెన్యూ కార్యాలయాలకు పూర్తిస్థాయి నిర్మాణాల కోసం 2023-24 బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) కోరింది. మంగళవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతం కుమార్‌, ఉపాధ్యక్షుడు నిరంజన్‌రావులు మంత్రితో భేటీ అయ్యారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘కొత్త కలెక్టరేట్ల మాదిరే ఆర్డీవో, తహసీల్దారు కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించాలి. కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలు, డివిజన్లు, కలెక్టరేట్లకు నూతన పోస్టులను ఏర్పాటు చేసి భర్తీ చేయాలని మంత్రిని కోరాం. కార్యాలయాల నిర్వహణ నిధులు, తహసీల్దారు, ఆర్డీవోలకు వాహనాలు, వీఆర్‌ఏలకు పే స్కేలు, ఉద్యోగ క్రమబద్ధీకరణకు నిధులు తదితర విషయాలపైనా విజ్ఞప్తి చేశాం’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని