ఆగస్టులో దళితబంధు జాతర

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ప్రయోగాత్మకంగా దళితబంధు ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యే క్రమంలో దళితబంధు జాతర ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది.

Published : 01 Feb 2023 03:58 IST

ఈటీవీ, కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ప్రయోగాత్మకంగా దళితబంధు ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యే క్రమంలో దళితబంధు జాతర ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. మంగళవారం రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌కు వచ్చిన సందర్భంగా ఈ అంశంపై అధికారులతో సమాలోచనలు చేశారు. కరీంనగర్‌ సర్క్యూట్‌ రెస్ట్‌ హౌజ్‌ ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు,  రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ల సమక్షంలో అధికారులకు కేటీఆర్‌ పలు సూచనలు చేశారు. ఆగస్టు 16వ తేదీ నాటికి పథకం ప్రారంభమై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా హుజూరాబాద్‌తోపాటు కరీంనగర్‌, హైదరాబాద్‌లలోనూ జాతర ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం వల్ల లబ్ధిదారులు ఎలా అభివృద్ధి చెందుతున్నారు? ఏమేరకు ఆదాయాన్ని పొందుతున్నారో క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించి నివేదిక పంపించాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తోపాటు అదనపు కలెక్టర్‌, శిక్షణ కలెక్టర్లతో కమిటీ ఏర్పాటుచేయాలని సూచించారు. హుజూరాబాద్‌లో జరిగే దళితబంధు జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా తీసుకురానున్నట్లు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు