Samathamurthy: నేటి నుంచి సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఈ నెల 2 నుంచి 14 వరకు సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జీవా ప్రతినిధులు పేర్కొన్నారు.

Updated : 02 Feb 2023 06:49 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఈ నెల 2 నుంచి 14 వరకు సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జీవా ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో సువర్ణమూర్తి భగవద్రామానుజులకు ఉత్సవారంభ స్నపనంతో వేడుకలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

మొదటి రోజు కార్యక్రమాలు..

* ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విష్వక్సేన వీధి శోధన

* మ.1.30 గంటలకు తీర్థ ప్రసాద గోష్ఠి

*  సా.5 నుంచి 5.45 వరకు సామూహిక విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణం

* సా.6 నుంచి 8.30 వరకు వేదికపై అంకురార్పణ వైనతేయ ప్రతిష్ఠ, త్రీర్థ ప్రసాద గోష్ఠి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని