ఐకేపీ వీవోఏలకు అండగా ప్రభుత్వం

ఇందిరాక్రాంతి పథం గ్రామ సంఘాల సహాయకుల (ఐకేపీ వీఓఏ)కు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరిస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు.

Published : 02 Feb 2023 03:50 IST

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌
సంఘం ఆవిర్భావ దినోత్సవం

ఈనాడు,హైదరాబాద్‌ : ఇందిరాక్రాంతి పథం గ్రామ సంఘాల సహాయకుల (ఐకేపీ వీఓఏ)కు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరిస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. తెలంగాణభవన్‌లో బుధవారం జరిగిన రాష్ట్ర ఐకేపీ వీఓఏల పదో వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ, ఐకేపీ వీఓఏలు రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ వారిపై పూర్తి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర దళిత, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఐకేపీ వీఓఏల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రూప్‌సింగ్‌, అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి, భారాస కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌, కార్యదర్శి నారాయణ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఐకేపీ వీఓఏలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, ప్రభుత్వం నుంచి ప్రత్యేకగుర్తింపు కార్డులు, ప్రమాదవశాత్తు మరణించిన వారికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు జీవిత బీమా సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా నేతలు మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని