రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఫిష్‌ క్యాంటీన్లు: మంత్రి తలసాని

రాష్ట్రంలో మత్స్యసంపద పెద్దఎత్తున పెరిగినందున చేపలను, వాటి ఉత్పత్తులను ప్రజలకు చౌకగా అందుబాటులో తెచ్చేందుకు ఫిష్‌ క్యాంటీన్లు, సంచార విక్రయకేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

Published : 02 Feb 2023 03:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మత్స్యసంపద పెద్దఎత్తున పెరిగినందున చేపలను, వాటి ఉత్పత్తులను ప్రజలకు చౌకగా అందుబాటులో తెచ్చేందుకు ఫిష్‌ క్యాంటీన్లు, సంచార విక్రయకేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. రాష్ట్రంలో చేపల వినియోగాన్ని పెంచేందుకు వంటకాలపై మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మాసాబ్‌ట్యాంక్‌లోని మత్స్యశాఖ కార్యాలయం ఆవరణలో రూ.25లక్షలతో ఏర్పాటుచేసిన ఫిష్‌ క్యాంటీన్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘‘తెలంగాణ ఏర్పడ్డాక ప్రారంభించిన ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్యసంపద గణనీయంగా పెరిగింది. సబ్సిడీపై మొబైల్‌ రిటైల్‌ ఫిష్‌ ఔట్‌లెట్‌లను ప్రారంభిస్తున్నాం.’’ అని తెలిపారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అథర్‌సిన్హా, సంచాలకుడు రాంచందర్‌, మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరాంభూక్యా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని