ఏకలవ్య పాఠశాలల్లో వెయ్యికి పైగా కొలువులు

ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో (ఈఎంఆర్‌ఎస్‌) బోధన, బోధనేతర పోస్టులను మూడేళ్లలో భర్తీచేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో తెలంగాణకు వెయ్యికిపైగా పోస్టులు రానున్నాయి.

Updated : 02 Feb 2023 04:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో (ఈఎంఆర్‌ఎస్‌) బోధన, బోధనేతర పోస్టులను మూడేళ్లలో భర్తీచేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో తెలంగాణకు వెయ్యికిపైగా పోస్టులు రానున్నాయి. గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లలకు 6 నుంచి 10 వరకు నిర్బంధ విద్యను అందించేందుకు గురుకుల తరహాలో కేంద్రం వీటిని ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23 ఏకలవ్య గురుకుల విద్యాలయాలు కొనసాగుతున్నాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు, మహబూబాబాద్‌లో అయిదు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఒక్కో ఈఎంఆర్‌ఎస్‌లో 6 నుంచి 10 వరకు చదివే విద్యార్థులు 480 మంది ఉంటారు. బోధన సిబ్బంది 29 మంది, బోధనేతర సిబ్బంది 23, నాలుగో తరగతి ఉద్యోగులు పది మంది అవసరం. ఈ లెక్కన రాష్ట్రంలోని ఈఎంఆర్‌ఎస్‌లో 1,426 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా వెయ్యికి పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆయా సొసైటీల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని