ఆదిమ గిరిజనుల అభివృద్ధికి ఊతం

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆదిమ గిరిజనుల అభివృద్ధి మిషన్‌లో భాగంగా వారి అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున కల్పించనుంది.

Published : 02 Feb 2023 03:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆదిమ గిరిజనుల అభివృద్ధి మిషన్‌లో భాగంగా వారి అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున కల్పించనుంది. ఆదిమ గిరిజనుల కోసం ఇప్పటికే నిధులు ఖర్చుచేస్తున్నా, ఆ మొత్తం సరిపోవడం లేదు. తాజాగా మూడేళ్ల మిషన్‌ కోసం రూ.15వేల కోట్లు ఖర్చుచేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని 570 ఆవాసాల్లో ఆదిమ గిరిజనులు ఉన్నారు. వీరి అభ్యున్నతి కోసం కేంద్రం ఏటా రూ.8-9 కోట్ల వరకు నిధులు ఇస్తోంది. తాజాగా బడ్జెట్‌లో భారీగా నిధులను పేర్కొనడంతో ఎక్కువ సౌకర్యాలు కల్పించేందుకు వీలవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని