1,553 జేఎల్‌ఎం పోస్టుల భర్తీ

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌) 1,601 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Published : 03 Feb 2023 05:25 IST

48 ఏఈ ఎలక్ట్రికల్‌   పోస్టులు కూడా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌) 1,601 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 48 అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ)ఎలక్ట్రికల్‌, 1,553 జూనియర్‌ లైన్‌మెన్‌(జేఎల్‌ఎం) పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా పోస్టులు, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలకు ఫిబ్రవరి 15 తర్వాత సంస్థ వెబ్‌సైట్‌లో చూడాలని ఎస్పీడీసీఎల్‌ వెల్లడించింది. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి గతేడాది మేలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఆగస్టు నెలలో ఎస్పీడీసీఎల్‌ రద్దు చేసింది. జులై 17న జరిగిన రాత పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఉద్యోగార్థులు నష్టపోకూడదని రద్దు చేస్తున్నట్లు అప్పట్లో సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. గతంలో 1,000 జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ సంఖ్య తాజా నోటిఫికేషన్‌లో 1,553కి పెరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు