ఆదాయపు పన్ను వసూళ్ల ఖర్చు అమెరికా తర్వాత మనదేశంలోనే తక్కువ

ఆదాయపు పన్ను వసూళ్ల కోసం అతి తక్కువగా ఖర్చు చేస్తున్నది అమెరికా తరవాత మన దేశమేనని ఆదాయపు పన్నుల శాఖ (హైదరాబాద్‌) ప్రధాన కమిషనర్‌ శిశిర్‌ అగర్వాల్‌ అన్నారు.

Published : 03 Feb 2023 05:25 IST

హైదరాబాద్‌ (రెడ్‌హిల్స్‌), న్యూస్‌టుడే: ఆదాయపు పన్ను వసూళ్ల కోసం అతి తక్కువగా ఖర్చు చేస్తున్నది అమెరికా తరవాత మన దేశమేనని ఆదాయపు పన్నుల శాఖ (హైదరాబాద్‌) ప్రధాన కమిషనర్‌ శిశిర్‌ అగర్వాల్‌ అన్నారు. గురువారం రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో ‘కేంద్ర బడ్జెట్‌-2023-24’పై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. మన దేశంలో ప్రతి వంద రూపాయల పన్ను వసూలుకు 57 పైసలు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఖర్చు యూకేలో 73, జపాన్‌లో 174, జర్మనీలో 135, కెనడాలో 150, ఫ్రాన్స్‌లో 111 పైసలుగా ఉందని వివరించారు. మనకంటే అతి తక్కువ ఖర్చు చేసే ఏకైక దేశం అమెరికా మాత్రమే అని వివరించారు. 65 శాతం ఐటీ రిటర్నులను ప్రాసెస్‌ చేసి, 24 గంటల వ్యవధిలోనే రిఫండ్‌లు ఇస్తున్నట్లు తెలిపారు. ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు అనిల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం భయాలు, మందిస్తున్న వృద్ధిరేటును పరిగణనలోకి తీసుకుని.. దేశం వృద్ధి బాటన సాగేందుకు అనువై బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రూపొందించారన్నారు. సెంట్రల్‌ టాక్స్‌ కమిషనర్‌ డి.పి.నాయుడు, ఎఫ్‌టీసీసీఐ జీఎస్టీ అండ్‌ కస్టమ్స్‌ కమిటీ ఛైర్మన్‌ వి.ఎస్‌.సుధీర్‌ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని