హైదరాబాద్‌లో డీఫిబ్రిలేటర్ల ఏర్పాటును పరిశీలిస్తాం

ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యే వారికి అత్యవసర చికిత్సను అందించి మరణాలను నిరోధించే ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌ యంత్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు.

Updated : 03 Feb 2023 05:37 IST

ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యే వారికి అత్యవసర చికిత్సను అందించి మరణాలను నిరోధించే ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌ యంత్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఒక వైద్యనిపుణుడు ముఖర్జీ చేసిన వినతిపై ఆయన స్పందించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో డీఫిబ్రిలేటర్లు ఏర్పాటు అయ్యాయని, విశ్వనగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లోనూ నెలకొల్పాలని ముఖర్జీ కోరారు. అత్యవసర పరిస్థితుల్లో సామాన్యులు కూడా ఈ పరికరాలను ఉపయోగించవచ్చని ముఖర్జీ  తెలపగా ఈ ఆలోచన బాగుందని మంత్రి ప్రశంసించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు