సోమేశ్‌కుమార్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్
కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు గురువారం హైకోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఈనాడు, హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు గురువారం హైకోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్లాట్ నెం.533 వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో సూర్యారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి భవనానికి రహదారి అవసరాల కోసం సూర్యారావుకు చెందిన ప్లాట్‌ను సేకరించగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. భూసేకరణ చట్టం కింద సేకరించాలని, లేదంటే ప్రత్యామ్నాయంగా తనకు మరో ప్లాటు కేటాయించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో అప్పటి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సోమేశ్‌కుమార్‌కు జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mehul Choksi: మెహుల్ ఛోక్సీపై రెడ్‌కార్నర్ నోటీసులు ఎత్తివేసిన ఇంటర్‌పోల్!
-
India News
Cyber Crime: వామ్మో.. స్కామ్ కాల్స్‌తో 53 బిలియన్ డాలర్లు కొల్లగొట్టారా?
-
World News
Sheikh Hasina: మా పోర్టులు భారత్ వాడుకోవచ్చు: హసీనా
-
Politics News
Prashant Kishor: ‘అలాగైతే.. విపక్షాల ఐక్యత పని చేయదు..!’
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్