ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహం

తెలంగాణ బహుజన పోరాట యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని త్వరలో హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించనున్నారు.

Published : 03 Feb 2023 04:05 IST

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ బహుజన పోరాట యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని త్వరలో హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించనున్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ గురువారం బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, గౌడ సంఘాల ప్రతినిధులతో కలిసి ట్యాంక్‌బండ్‌పై పలు స్థలాలను పరిశీలించి ఒకటి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘‘ట్యాంక్‌బండ్‌పై వివిధ స్థలాలను పరిశీలించి అనువైనదానిని ఎంపిక చేశాం. అతి త్వరలోనే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తాం’’ అని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్‌, బీసీ కమిషన్‌ సభ్యుడు కిషోర్‌ గౌడ్‌, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని