ఆధ్యాత్మిక చింతనతో మనసుకు ప్రశాంతత

ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక చింతనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు.

Published : 03 Feb 2023 04:05 IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

నందిగామ, న్యూస్‌టుడే: ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక చింతనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామంలోని శ్రీరామచంద్రమిషన్‌లో మిషన్‌ వ్యవస్థాపకులు లాలాజీ మహారాజ్‌ (శ్రీరామచంద్రజీ మహారాజ్‌) 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన కన్హ శాంతి వనాన్ని గురువారం సందర్శించారు. జస్టిస్‌ నవీన్‌రావు సూచన మేరకు ఈ వనాన్ని సందర్శించినట్లు చెప్పారు. శాంతివనంలో గురూజీ దాజీ.. ప్రశాంతత, మానవీయ విలువలు నేర్పుతున్న తీరును కొనియాడారు. న్యాయమూర్తులంతా ఒక కుటుంబం మాదిరిగా ఉంటామని, ధ్యాన పక్రియ సందేశం వారికి చేరేందుకు తనవంతు కృషిచేస్తానని చెప్పారు. ఒత్తిడిని జయించేందుకు ధ్యానం మనసుకు వరం లాంటిదని అన్నారు. అనంతరం దాజీతో పాటు ధ్యానం చేశారు.

దేశ ప్రగతికి ఆధ్యాత్మికత దోహదం: కేంద్ర మంత్రి దేవుసిన్హ్‌ చౌహాన్‌

దేశ ప్రగతికి ఆధ్యాత్మికత ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్‌ చౌహాన్‌ అన్నారు. ఆయన వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ధ్యాన పక్రియను విశ్వవాప్తం చేసేందుకు కృషిచేస్తున్న శ్రీరామచంద్రమిషన్‌ గ్లోబల్‌గైడ్‌ దాజీ సేవలను కొనియాడారు. అనంతరం లాలాజీ మహారాజ్‌ స్మారకార్థం తపాలాశాఖ రూపొందించిన స్టాంపును మంత్రి విడుదల చేశారు. సహజమార్గ్‌ పద్ధతిలో నిత్యం ధ్యానం చేయడం ద్వారా మానసిక పరివర్తన బలపడుతుందని శ్రీరామచంద్రమిషన్‌ గ్లోబల్‌ గైడ్‌ కమలేష్‌ డి పటేల్‌ (దాజీ) అన్నారు. ఉత్సవాలలో భాగంగా ప్రఖ్యాత వేణుగాన కళాకారుడు, మ్యాస్ట్రో హరిప్రసాద్‌ చౌరాసియా తన బృందంతో కచేరి నిర్వహించారు. చౌరాసియా వేణుగానంతో వీక్షకులు, అభ్యాసీలు మంత్రముగ్ధులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని