కాంట్రాక్ట్‌ అధ్యాపకుల పదవీ విరమణ వయసు 61

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్టు  అధ్యాపకుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 03 Feb 2023 04:05 IST

వేతనాలు చెల్లించేది జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లే
ప్రభుత్వం ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్టు  అధ్యాపకుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై వారికి వేతనాలను డ్రా చేసి ఇచ్చే అధికారాన్ని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు అప్పగిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బయోమెట్రిక్‌ ఆధారిత హాజరు మేరకు వారికి వేతనాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటివరకు జీతాల చెల్లింపు అధికారం ఆయా జిల్లాల ఇంటర్‌ విద్యాశాఖ అధికారులకు ఉండేది. దానివల్ల జిల్లాలోని ఏ ఒక్క కళాశాల నుంచి వివరాలు అందకపోయినా మిగిలిన వారికి వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరిగేది. ఇకపై ఆ సమస్య ఉండదని కాంట్రాక్టు అధ్యాపక సంఘం నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 404 కళాశాలల్లో 3,541 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని