ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం ఉరి

పేదలు, కూలీల సామాజిక భద్రత కోసం చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఉరి వేస్తోందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు.

Published : 03 Feb 2023 04:28 IST

అందుకే బడ్జెట్‌లో కోతలు: మంత్రి ఎర్రబెల్లి ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: పేదలు, కూలీల సామాజిక భద్రత కోసం చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఉరి వేస్తోందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. ఈ పథకానికి రూ.2.72 లక్షల కోట్లను కేటాయించాల్సి ఉన్నా నిరుటి కంటే బడ్జెట్‌లో ఒకేసారి రూ.30 వేల కోట్లు తగ్గించి రూ.60 వేల కోట్లకే పరిమితం చేసిందని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినం సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం సంబురాలు నిర్వహించారు. తెలంగాణ ఈజీఎస్‌ ఉద్యోగులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఉద్యోగుల కాలమానిని మంత్రి ఆవిష్కరించారు. ‘‘కూలీలకు పనిదినాలు పెంచాలని కేంద్రాన్ని కోరాం. కానీ అది పేదల గురించి ఆలోచించకుండా ఉపాధి హామీ బడ్జెట్‌లో కోత విధించింది’’ అని ఎర్రబెల్లి విమర్శించారు. కార్యక్రమంలో ఈజీఎస్‌ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌ లింగయ్య ఇతర నేతలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు