5న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం

రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల అయిదో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరగనుంది.

Updated : 03 Feb 2023 05:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల అయిదో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరగనుంది. ఉదయం 10.30 గంటలకు జరిగే సమావేశంలో 2023-24 సంవత్సర రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించనుంది. ఈ నెల 6న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 5న మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి గురువారం నిర్ణయించారు. కొత్త బడ్జెట్‌ కేటాయింపులకు సంబంధించిన అంశాలతో పాటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌, రాష్ట్రంపై దాని ప్రభావం, పరిణామాలు, ఇతర అంశాలను సైతం చర్చించనున్నట్లు తెలిసింది. ఆదివారం మంత్రిమండలి సమావేశం ముగిసిన అనంతరం మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగే భారాస ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు కేసీఆర్‌ బయల్దేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి నాందేడ్‌కు చేరుకుంటారు. సభలో ప్రసంగించిన అనంతరం హైదరాబాద్‌కు తిరిగివస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని