సచివాలయం ప్రారంభాన్ని నిలిపివేయండి

నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌ గురువారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Updated : 03 Feb 2023 10:26 IST

ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన కె.ఎ.పాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌ గురువారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎం తన వ్యక్తిగత ప్రచారం నిమిత్తం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అందులో భాగంగా ఆయన జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న సచివాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జన్మించిన ఏప్రిల్‌ 14న కాకుండా ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించడం సరికాదన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు సీఎం కార్యాలయాన్ని చేర్చారు. నంబరు కేటాయింపు నిమిత్తం పరిశీలనలో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు