21 నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఈ నెల 21వ తేదీ నుంచి పంచనారసింహుల వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి.

Published : 03 Feb 2023 04:28 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఈ నెల 21వ తేదీ నుంచి పంచనారసింహుల వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. పునర్నిర్మితమైన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇదే తొలిసారి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీ రాత్రివేళ ఎదుర్కోలు వేడుక, 28న రాత్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణ మహోత్సవం, మార్చి 1న రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు. అదే నెల 3న గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే శతఘటాభిషేకంతో ఆలయ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ క్షేత్రానికి అనుబంధ ఆలయమైన పాతగుట్టలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సింహ వాహనోత్సవం, శ్రీస్వామి, అమ్మవార్ల ఎదుర్కోలును కనులపండువగా నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు