నేడు ద.మ.రైల్వే కేటాయింపుల వెల్లడి

రైల్వే జోన్ల వారీగా నిధుల కేటాయింపులకు సంబంధించిన పింక్‌బుక్‌ను పార్లమెంటు ఉభయ సభల్లో నేడు  ప్రవేశపెట్టనున్నారు.

Published : 03 Feb 2023 04:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వే జోన్ల వారీగా నిధుల కేటాయింపులకు సంబంధించిన పింక్‌బుక్‌ను పార్లమెంటు ఉభయ సభల్లో నేడు  ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత దాన్ని విడుదల చేస్తారని, జోన్‌కు  సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ శుక్రవారం వెల్లడిస్తారని రైల్వే వర్గాలు వెల్లడించాయి. జోన్‌కు గతేడు రూ.9,125 కోట్ల నిధుల్ని కేంద్రం కేటాయించింది. ఈ ఏడాది దానికన్నా 30 శాతం అధికంగా కేటాయించే అవకాశాలున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద.మ.రైల్వేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలో కొంతభాగం ఉంది. తెలంగాణకు గత బడ్జెట్‌లో రూ.3,048 కోట్లు మాత్రమే కేటాయించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు