కర్ణాటక-ఏపీ ఆర్టీసీల ఒప్పందం

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు కర్ణాటకలో నిత్యం 2.34 లక్షల కి.మీ. తిరిగేలా ఒప్పందం కుదిరింది. కర్ణాటక బస్సులు ఏపీలో నిత్యం 2.26 లక్షల కి.మీ. తిరగనున్నాయి.

Published : 03 Feb 2023 04:59 IST

ఈనాడు, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు కర్ణాటకలో నిత్యం 2.34 లక్షల కి.మీ. తిరిగేలా ఒప్పందం కుదిరింది. కర్ణాటక బస్సులు ఏపీలో నిత్యం 2.26 లక్షల కి.మీ. తిరగనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, కేఎస్‌ఆర్టీసీ ఎండీ వి.అంబుకుమార్‌ గురువారం విజయవాడలో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఇప్పటివరకు కర్ణాటకలో 1.65 లక్షల కి.మీ. మేర బస్సులను తిప్పేది. ఆ రాష్ట్ర బస్సులు ఏపీలో 1.56 లక్షల కి.మీ. తిరిగేవి. ఇప్పుడు కి.మీ. పెరగడంతో ఆ మేరకు బస్సులనూ పెంచనున్నారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత కర్ణాటకతో తొలిసారి ఏపీఎస్‌ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు