రామయ్య హుండీ ఆదాయం రూ.2.20 కోట్లు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం చిత్రకూట మండపంలో లెక్కించారు.

Published : 03 Feb 2023 04:59 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం చిత్రకూట మండపంలో లెక్కించారు. భక్తుల నుంచి 84 రోజుల్లో రూ.2,20,91,906 నగదు ఆదాయం వచ్చిందని ఈవో శివాజీ వెల్లడించారు. దీంతోపాటు 250 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి లభించింది. యూఎస్‌ డాలర్లు 499, ఆస్ట్రేలియా డాలర్లు 180, యూరోలు 140, యూఏఈ దిర్హమ్స్‌ 125, సింగపూర్‌ డాలర్లు 85, కెనడా డాలర్లు 55తోపాటు మరికొన్ని దేశాల భక్తుల నుంచి కూడా కానుకల రూపంలో ఆలయానికి ఆదాయం సమకూరిందని ఈవో వివరించారు. ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు, సంక్రాంతి, పండగసెలవుల కారణంగా ఆదాయం ఆశాజనకంగా వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు