తలసరి ఆదాయంలో 15 శాతం వృద్ధిరేటు నమోదు

రాష్ట్రంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.3,17,115గా ప్రభుత్వం అంచనావేసింది. మొదటిసారిగా తలసరి ఆదాయం రూ.3 లక్షలను దాటగా..గత ఏడాది కంటే 15 శాతం వృద్ధిరేటు నమోదైంది.

Updated : 04 Feb 2023 05:15 IST

మొదటిసారి దాటిన రూ.3 లక్షల మార్క్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.3,17,115గా ప్రభుత్వం అంచనావేసింది. మొదటిసారిగా తలసరి ఆదాయం రూ.3 లక్షలను దాటగా..గత ఏడాది కంటే 15 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఈ విషయాన్ని గవర్నర్‌ ప్రసంగంలో వెల్లడించారు.గత ఏడాది, రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని రూ.2,75,443గా అంచనా వేశారు. ప్రాథమిక అంచనాల మేరకు గత ఏడాదికంటే ఈసారి తలసరి ఆదాయం రూ.41,672 పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని