ఫార్ములా-ఇ రేసుపై కేటీఆర్‌కు ఆనంద్‌మహీంద్రా ధన్యవాదాలు

ఫార్ములా-ఇ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించే మొదటి భారతీయ నగరంగా హైదరాబాద్‌ ఆవిర్భవించిందని మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా శుక్రవారం ట్విటర్‌లో ఆనందం వ్యక్తంచేశారు.

Published : 04 Feb 2023 03:42 IST

ఈనాడు,హైదరాబాద్‌: ఫార్ములా-ఇ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించే మొదటి భారతీయ నగరంగా హైదరాబాద్‌ ఆవిర్భవించిందని మహీంద్రా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా శుక్రవారం ట్విటర్‌లో ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

జర్మన్‌ పార్లమెంటరీ బృందం భేటీ

జర్మనీ పార్లమెంటరీ కమిటీ సభ్యులు శుక్రవారం శాసనసభలో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. భారత్‌-జర్మనీ సంబంధాలు, తెలంగాణలో పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం వారంతా శాసనసభాపతి పోచారం, మండలి ఛైర్మన్‌ గుత్తా, మంత్రులు, ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని