ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాల్సిందే: హైకోర్టు

వైద్యవిద్యలో పీజీ పూర్తి చేశాక ఏడాదిపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది.

Published : 04 Feb 2023 03:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యవిద్యలో పీజీ పూర్తి చేశాక ఏడాదిపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్బంధ సేవ అందించాలన్న ప్రభుత్వ నిబంధనను సవాలు చేస్తూ డాక్టర్‌ అభినవ్‌ సింగ్లా మరో ఆరుగురు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారించిన జస్టిస్‌ ముమ్మినేని సుధీర్‌కుమార్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు. పీజీ అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాదిపాటు పనిచేయాలన్న నిబంధన తెలంగాణ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ సవరణ చట్టానికి విరుద్ధమన్న పిటిషనర్ల వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. మిగిలిన అభ్యర్థులు ప్రభుత్వ సర్వీసులో కొనసాగుతుండగా కేవలం ఆరుగురే కోర్టుకు వచ్చిన విషయాన్ని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని