రెండు మూడు రోజుల్లో ఎంసెట్‌ తేదీల వెల్లడి

టీఎస్‌ ఎంసెట్‌ను మే మొదటి లేదా రెండో వారంలో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఏపీలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించాలని ఇప్పటికే అక్కడి అధికారులు నిర్ణయించారు.

Published : 04 Feb 2023 03:42 IST

మే మొదటి లేదా రెండో వారంలో నిర్వహణకు యోచన

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ ఎంసెట్‌ను మే మొదటి లేదా రెండో వారంలో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఏపీలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించాలని ఇప్పటికే అక్కడి అధికారులు నిర్ణయించారు. ఎంసెట్‌లకు రెండు రాష్ట్రాల విద్యార్థులు హాజరవుతారు. పరీక్ష కేంద్రాలను కూడా ఏపీ, తెలంగాణలలో ఏర్పాటు చేస్తారు. ఏపీ ఎంసెట్‌ ముగిసిన తర్వాత జరిపితే బాగా ఆలస్యమవుతుంది. అంతేకాకుండా జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఉన్నందున మే 1 నుంచి 14 మధ్యలో టీఎస్‌ ఎంసెట్‌ను జరపాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే 7న నీట్‌ ఉన్నందున వీలుంటే ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ లేదా అగ్రికల్చర్‌లో ఏదైనా ఒకదాన్ని ఆలోపు పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి శుక్రవారం తన కార్యాలయంలో టీసీఎస్‌ అయాన్‌, టీఎస్‌ ఆన్‌లైన్‌ అధికారులతో సమావేశమై చర్చించారు. టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే పరీక్షల తేదీలను పరిశీలించి ఆ అభ్యర్థులకు ఇబ్బంది తలెత్తకుండా లాసెట్‌, పీజీఈసెట్‌, ఎడ్‌సెట్‌, ఐసెట్‌ తదితర తేదీలను ఖరారు చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణతో చర్చించి రెండు మూడు రోజుల్లో ఆయా ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటిస్తామని లింబాద్రి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు