కు.ని.శస్త్రచికిత్స చేయించుకున్న మహిళకు ఒక గ్రూప్‌ రక్తం బదులు మరొకటి

కోరుట్ల ఏరియా ఆసుపత్రిలో ఓ మహిళకు ఒక గ్రూపు రక్తం బదులు మరో గ్రూపుది ఎక్కించడంతో సమస్యలు తలెత్తాయి. బుధవారం ఆసుపత్రిలో అయిదుగురికి కుటుంబ నియంత్రణ  శస్త్రచికిత్సలు చేశారు.

Published : 04 Feb 2023 03:42 IST

బాంబే బ్లడ్‌ గ్రూప్‌ కావడంతో హైదరాబాద్‌కు పరుగులు

కోరుట్ల, కరీంనగర్‌ సంక్షేమ విభాగం, న్యూస్‌టుడే: కోరుట్ల ఏరియా ఆసుపత్రిలో ఓ మహిళకు ఒక గ్రూపు రక్తం బదులు మరో గ్రూపుది ఎక్కించడంతో సమస్యలు తలెత్తాయి. బుధవారం ఆసుపత్రిలో అయిదుగురికి కుటుంబ నియంత్రణ  శస్త్రచికిత్సలు చేశారు. ఇందులో సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన భూక్యా లత కూడా ఉన్నారు. గురువారం లతను పరీక్షించిన వైద్యులు రక్తం తక్కువగా ఉన్నట్లు గుర్తించి ఓ పాజిటివ్‌ బ్లడ్‌ ఎక్కించారు. వాంతులు చేసుకోవడంతో మధ్యలోనే నిలిపివేశారు. మరోసారి రక్తపరీక్ష చేయగా ఓ పాజిటివ్‌లో అరుదైన ‘బాంబే బ్లడ్‌ గ్రూప్‌’ అని తేలింది. వెంటనే వైద్యులు ఆమెను కరీంనగర్‌ ఆసుపత్రికి పంపించారు. అక్కడా బాంబే బ్లడ్‌ గ్రూప్‌  లభించలేదు. చివరకు హైదరాబాద్‌ నిమ్స్‌లో ఉందని తెలియడంతో వైద్యులు బాధిత బంధువులను అక్కడకు పంపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు