బీసీల డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తా

బీసీల న్యాయమైన డిమాండ్లు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయమంత్రి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పీఐ) జాతీయ అధ్యక్షులు రాందాస్‌ అథవాలె హామీఇచ్చారు.

Published : 04 Feb 2023 03:42 IST

కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలె

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: బీసీల న్యాయమైన డిమాండ్లు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయమంత్రి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పీఐ) జాతీయ అధ్యక్షులు రాందాస్‌ అథవాలె హామీఇచ్చారు. శుక్రవారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్‌ కోర్టు హోటల్లో బీసీ పొలిటికల్‌ ఐకాస తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ రాచాల యుగంధర్‌ గౌడ్‌ అధ్యక్షతన వివిధ బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ జనగణన, రిజర్వేషన్ల పెంపు, ప్రత్యేక మంత్రిత్వశాఖ కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న ఐకాసకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు లేనోళ్లు రాజ్యమేలుతున్నారన్నారు. కేంద్రంలో 27 మంది బీసీలకు మంత్రి పదవులు ఇస్తే రాష్ట్రంలో కేసీఆర్‌ ముగ్గురికే ఇచ్చారన్నారు. బీసీలు పోరాడి రాజకీయంగా ఎదిగి హక్కులు సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్‌గౌడ్‌, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్య, వాల్మికి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేపల్లె కృష్ణనాయుడు, ఫోరమ్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ చైర్మన్‌ నాగుల శ్రీనివాస్‌ యాదవ్‌, ఆర్‌పీఐ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు పేరం శివనాగేశ్వర్‌రావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని