గతేడాది కంటే 65 శాతం అధికం

కేంద్ర బడ్జెట్‌లో రైల్వే కేటాయింపుల్లో దక్షిణ మధ్య రైల్వేకి ప్రాధాన్యం లభించిందని జోన్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు.

Published : 04 Feb 2023 03:42 IST

ద.మ.రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో రైల్వే కేటాయింపుల్లో దక్షిణ మధ్య రైల్వేకి ప్రాధాన్యం లభించిందని జోన్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. 2023-24 సంవత్సరానికి రూ.13,786.19 కోట్లు కేటాయించారని, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 65% పెరిగాయని చెప్పారు. కేటాయింపులకు సంబంధించిన పింక్‌బుక్‌ వివరాలను మంగళవారం సాయంత్రం రైల్‌నిలయంలో విలేకరులకు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రెండో దశ పనుల్ని 2024 మార్చినాటికి అందుబాటులోకి తీసుకువస్తామని.. చర్లపల్లిలో టెర్మినల్‌ నిర్మాణాన్ని వచ్చే ఏడాది పూర్తి చేస్తామన్నారు. సికింద్రాబాద్‌, నెల్లూరు, తిరుపతి స్టేషన్ల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో రూ.550 కోట్ల నిధులిచ్చినట్లు తెలిపారు.

రెండో, మూడో లైను, బైపాస్‌ పనులకు: రూ.3,374.44 కోట్లు

కొత్త లైన్ల నిర్మాణానికి: రూ.819 కోట్లు.

విద్యుద్దీకరణ పనులకు: రూ.588 కోట్లు.

లెవల్‌ క్రాసింగ్‌లు, ఆర్వోబీలు రూ.1,360 కోట్లు

వచ్‌కు: రూ.68.14 కోట్లు. ఈ పథకం కింద కొత్త సెక్షన్లు: వాడి-రేణిగుంట, దువ్వాడ-విజయవాడ, బల్లార్ష-విజయవాడ-గూడూరు, మన్మాడ్‌-పర్బనీ-నాందేడ్‌-సికింద్రాబాద్‌-గద్వాల-డోన్‌-గుంతకల్‌, బీదర్‌-పర్లి వైజనాథ్‌-పర్బనీ, వాడి-గుంతకల్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని