పంట రుణం.. పెను భారం
సకాలంలో పంట రుణాలు చెల్లించకపోతే ఎలాంటి నష్టం జరుగుతుందో చెప్పేందుకు ఈ ఇద్దరు రైతుల ఉదాహరణలే నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా పంట రుణాలను మాఫీ చేస్తోంది.
అవగాహన లేక చెల్లించని ఫలితం
రైతులకు బ్యాంకుల నోటీసులు
రుణ మాఫీ కోసం కర్షకుల ఎదురుచూపులు
ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే
* ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచలకకు చెందిన రైతు వెంకయ్య ఓ బ్యాంకు నుంచి రూ.లక్ష పంట రుణం తీసుకుని సకాలంలో చెల్లించారు. రూ.3 వేలు వడ్డీ మాఫీ వచ్చింది. ఆ ఏడాదికి కేవలం రూ.4 వేలు మాత్రమే వడ్డీ పడింది.
* ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడుకు చెందిన రామారావు ఓ బ్యాంకు నుంచి రూ.లక్ష పంట రుణం తీసుకున్నారు. రుణ మాఫీ వస్తుందని భావించి చెల్లించకుండా వదిలేశారు. ఐదేళ్లకు వడ్డీ ఇతర ఛార్జీల భారం కలిసి రూ.80,719 అయింది. ఇది అసలు రూ.లక్షకు అదనం.
సకాలంలో పంట రుణాలు చెల్లించకపోతే ఎలాంటి నష్టం జరుగుతుందో చెప్పేందుకు ఈ ఇద్దరు రైతుల ఉదాహరణలే నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా పంట రుణాలను మాఫీ చేస్తోంది. రుణ మాఫీ పథకం కింద తుది దశలో ఇంకా రూ.లక్ష విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈ పథకం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది రైతులు రుణాలను సకాలంలో చెల్లించటం లేదు. మాఫీ ప్రక్రియ ఐదేళ్లుగా సాగుతుండటంతో సకాలంలో రుణాలు చెల్లించని రైతులపై ఇప్పుడు వడ్డీ భారం తడిసి మోపెడవుతోంది. వచ్చే మాఫీలో అధికశాతం వడ్డీలకే సరిపోయే పరిస్థితి ఉంది. పంట రుణాలు సకాలంలో చెల్లించకపోవటంతో రైతులు మొండి ఖాతాదారులుగా మిగిలిపోతున్నారు.
రైతులకు తీరని నష్టం
సకాలంలో రుణం చెల్లించక సిబిల్ స్కోర్ తగ్గిపోయి బ్యాంకులు/ ఇతర వ్యాపార సంస్థల్లో రుణాలు పొందే అవకాశం కోల్పోతున్నారు. ఇప్పుడు కొన్ని బ్యాంకులు సకాలంలో పంట రుణాలు చెల్లించని రైతులకు నోటీసులు ఇస్తున్నాయి. రుణ మాఫీ వచ్చే వరకు నిరీక్షించటం వల్ల పడే వడ్డీ భారం గురించి అవగాహన కల్పిస్తున్నాయి. రుణాల రెన్యువల్‌కు, రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీకి ఎలాంటి సంబంధం లేదని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించినప్పటికీ చెల్లించకపోవటంతో అసలుతో కలిపి వడ్డీ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది.
* రైతులు తమ పంట రుణాలను సంవత్సరం లోపల పునరుద్ధరించుకుంటే కేవలం 7 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వడ్డీ రాయితీకి అర్హత పొందుతారు. ఏడాది లోపల పంట రుణం రెన్యువల్ చేసుకోని వారికి 14 శాతం అంటే రెండింతలు వడ్డీ పడుతుంది.
* ఉదాహరణకు రూ.లక్ష పంట రుణం తీసుకుంటే...ప్రతి సంవత్సరం సక్రమంగా కట్టే రైతు 5 సంవత్సరాలకు చెల్లించే వడ్డీ రూ.20 వేలు మాత్రమే.
* నిర్ణీత గడువులోగా చెల్లించని రైతు వడ్డీ, ఇతరత్రా ఛార్జీల రూపంలో రూ.79,739 చెల్లించాల్సి ఉంటుంది
* ఏటా సక్రమంగా చెల్లించే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీ రాయితీలు మాత్రమే కాకుండా బ్యాంకు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 10 శాతం అప్పు పెంచి ఇస్తుంది.
ఖమ్మం జిల్లాలో రుణమాఫీ ఇలా...
* రూ.25 వేల వరకు రుణమాఫీ అయిన రైతులు: 20,890
* రూ.50వేల వరకు మాఫీ అయిన రైతులు: 33,575
* రూ.లక్ష వరకు మాఫీకి అర్హత కలిగిన రైతులు: 3,20,000
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Modi - Rahul: కాంగ్రెస్ ర్యాలీ వాయిదా..ఒకేరోజు మోదీ, రాహుల్ మీటింగ్స్
-
Politics News
CM KCR: నా రాజకీయ జీవితమంతా పోరాటాలే: సీఎం కేసీఆర్
-
Politics News
Andhra News: రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స
-
Crime News
Crime: అసలే త్రిపుల్ రైడింగ్... ఒక్కరికి హెల్మెట్లు లేవు..పైగా వన్ వీల్‌తో విన్యాసాలు..
-
General News
Vande Bharat: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్’.. ప్రారంభోత్సవం రోజున ఆగే స్టేషన్లు ఇవే!
-
Movies News
Guna Sekhar: అప్పుడు మోహన్‌బాబు నా ఆఫర్ రిజెక్ట్ చేశారు: గుణశేఖర్