Kakatiya University: ప్రింటర్‌ పాడైందని వాట్సప్‌లో ప్రశ్నపత్రం

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ప్రస్తుతం డిగ్రీ ఇంటర్నల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి 20 మార్కులు ఉంటాయి.

Updated : 05 Feb 2023 07:29 IST

ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ప్రస్తుతం డిగ్రీ ఇంటర్నల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి 20 మార్కులు ఉంటాయి. వాస్తవానికి మామూలు పరీక్షలు లాగానే ఇంటర్నల్‌ పరీక్షలకు ప్రశ్నపత్రం ఇవ్వాలి. ఇందుకు భిన్నంగా ఆదిలాబాద్‌ ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం వాట్సప్‌లోనే ప్రశ్నపత్రం పంపించారు. విద్యార్థులు దానిని సెల్‌ఫోన్‌లో చూస్తూ ఆన్సర్‌ షీటులో జవాబులు రాస్తూ కనిపించారు. ఈ విషయమై ప్రిన్సిపల్‌ జగ్‌రాం అంతర్బేదితో మాట్లాడగా.. ‘‘వాస్తవానికి పేపర్‌ ఇవ్వాలి. ప్రింటర్‌ పాడవడంతో పిల్లలకు వాట్సప్‌ గ్రూపులో పోస్టు చేశాం. పిల్లలు కాపీ కొట్టకుండా ఆరుబయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు