ఉమ్మడి జిల్లాలో సర్వీసుకు పాయింట్లు కేటాయించాలి

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జీవో 317 కింద కొత్త జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు బదిలీల్లో ఉమ్మడి జిల్లాలోని సర్వీసుకు పాయింట్లు కేటాయించాలంటూ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

Published : 07 Feb 2023 03:21 IST

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జీవో 317 కింద కొత్త జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు బదిలీల్లో ఉమ్మడి జిల్లాలోని సర్వీసుకు పాయింట్లు కేటాయించాలంటూ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించి ప్రభుత్వం గత నెల 25న జారీచేసిన జీవో 5లోని నిబంధనను సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు 53 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ కె.శరత్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు, డి.బాలకిషన్‌రావు తదితరులు వాదనలు వినిపిస్తూ బదిలీల నిమిత్తం జారీచేసిన జీవో 5లోని నిబంధన 5(3) ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తిచేసినవారు బదిలీకి అర్హులని, కౌన్సెలింగ్‌ నిమిత్తం దరఖాస్తు చేసుకోవచ్చన్న నిబంధన చట్ట, రాజ్యాంగ విరుద్ధమన్నారు. జీవో 317 ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయించినవారికి రెండేళ్ల సర్వీసు నిబంధన వర్తింపజేయడం సరికాదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి కొత్త జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు పాత జిల్లాల్లో సర్వీసుకు పాయింట్లు కేటాయించి బదిలీలకు అవకాశం ఇవ్వాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని