మార్చి 30న భద్రాద్రిలో శ్రీరామ నవమి

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహించనున్న శ్రీరామ నవమి-పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవాల వివరాలను ఈవో శివాజీ సోమవారం వెల్లడించారు.

Updated : 07 Feb 2023 05:48 IST

31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహించనున్న శ్రీరామ నవమి-పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవాల వివరాలను ఈవో శివాజీ సోమవారం వెల్లడించారు. మార్చి 22న ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేసి చతుర్వేద సహిత శ్రీరామాయణ మహా క్రతువుకు అంకురార్పణ చేస్తారు. 12 హోమ గుండాల వద్ద ఆ రోజు నుంచి పారాయణం ఉంటుంది. అదేనెల 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూజ చేస్తారు. 27న గరుడాధివాసం, 28న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, దేవతల ఆహ్వానం, 29న ఎదుర్కోలు చేస్తారు. 30న శ్రీరామ నవమి సందర్భంగా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు శ్రీసీతారాముల తిరు కల్యాణోత్సవం ఉంటుంది. అదేరోజున శ్రీరామ పునర్వసు దీక్షలను ఆరంభిస్తారు. 31న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తారు. శ్రీరామాయణ మహా క్రతువుకు పూర్ణాహుతి పలికి రథోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 1న సదస్యం, 2న తెప్పోత్సవం, 3న ఊంజల్‌ సేవ, 4న వసంతోత్సవం, 5న చక్రతీర్థం నిర్వహిస్తారు.

* మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు నిత్య కల్యాణాలు, మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 5 వరకు దర్బారు సేవలు, మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 11 వరకు పవళింపు సేవలు ఉండవని ఈవో తెలిపారు. 27న శ్రీరామ పునర్వసు దీక్షలను విరమిస్తారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని