నేటి బదిలీలు, పదోన్నతుల జాబితాకు బ్రేక్‌

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జాప్యం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్ల ఆధారంగా ఉపాధ్యాయ బదిలీలకు సీనియారిటీ జాబితా, పదోన్నతుల కోసం తాత్కాలిక సీనియారిటీ జాబితాలను మంగళవారం వెల్లడించాల్సి ఉంది.

Published : 07 Feb 2023 03:46 IST

హైకోర్టు తీర్పు నేపథ్యంలో వెల్లడించవద్దని విద్యాశాఖ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జాప్యం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్ల ఆధారంగా ఉపాధ్యాయ బదిలీలకు సీనియారిటీ జాబితా, పదోన్నతుల కోసం తాత్కాలిక సీనియారిటీ జాబితాలను మంగళవారం వెల్లడించాల్సి ఉంది. వాటిని వెల్లడించవద్దని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఆర్‌జేడీ, డీఈఓలను ఆదేశించారు. అంతేకాకుండా ఉపాధ్యాయ ఖాళీల జాబితాను కూడా ప్రకటించరాదని సూచించారు. స్థానికత కాకుండా సర్వీస్‌ సీనియారిటీని ఆధారం చేసుకొని 317 జీఓ ద్వారా గత ఏడాది 25 వేల మందిని ప్రభుత్వం ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. బదిలీ కాకముందు ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకొని తమకు కూడా బదిలీ దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలని కొందరు ఇటీవల హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దానిపై సోమవారం హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించింది. ఈక్రమంలోనే సోమవారం రాత్రి విద్యాశాఖ తాజా ఆదేశాలను జారీ చేసింది. తాజా పరిణామం కారణంగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. 317 జీఓ ద్వారా ఇతర జిల్లాలకు బదిలీ అయిన వారికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. అదేజరిగితే  మరో 15 వేల మంది బదిలీ దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని