సాగుకు ఇబ్బందుల్లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలి

రాష్ట్రంలో పంటలకు ఇబ్బందులు రాకుండా విద్యుత్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు.

Published : 08 Feb 2023 03:28 IST

మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పంటలకు ఇబ్బందులు రాకుండా విద్యుత్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంతరాయం లేకుండా, రాత్రి వేళలో కనీసం 5 గంటలు విద్యుత్‌ సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం సుఖేందర్‌రెడ్డికి లేఖ రాశారు. ‘మండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో జరిగిన చర్చలో రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా కావడం లేదని సభ దృష్టికి తీసుకువస్తే.. భారాస సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు కల్పించుకుని ఎక్కడైనా 24 గంటల విద్యుత్‌ సరఫరా కాకపోతే సంబంధిత మంత్రికి, విద్యుత్‌ శాఖకు తెలియచేయాలని సూచించారు. అందుకే ఆ వివరాలను లేఖ ద్వారా విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీలతోపాటు మీ దృష్టికి తెస్తున్నా’ అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు